Thursday, May 7, 2026

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మనోహరాబాద్ మండలంలోని కలకల్ గ్రామంలో నిర్వహించిన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు.ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిన్నారులను వాహనాలపై తీసుకెళ్తున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మైనర్ల డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్‌పై నియంత్రణ అవసరమని అన్నారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వాహనదారులు బాధ్యతతో నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే నివారణకు మార్గమన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular