
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 16,చిన్నశంకరంపేట:- ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ వైపుగా ప్రయాణం చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు. బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఇన్చార్జి మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ అధ్యక్షతన పిఎం శ్రీ పాఠశాల స్పోర్ట్స్ వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి విజయ హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా రంగాలలో గెలుపొందిన వాలీబాల్ లో కెప్టెన్ నరేందర్, వినయ్, అశ్వత్, మోసిన్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు అందించారు. సర్పంచ్లు కంజ్జర్లచంద్రశేఖర్,హళవత్ మోహన్, ఇమ్మడి నరేష్ మాట్లాడుతూ, మీ భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ వైపుగా ప్రయాణం చేయాలని విద్యార్థులు ఉద్దేశించి తెలిపారు. మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ , ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి కర్రే పోచయ్య లు మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ కింద ఎంపిక అయిందని, ఇందులో కంప్యూటర్ ల్యాబ్ ను, తరగతి గదులను, డిజిటల్ విద్య, ఫర్నిచర్, మరుగుదొడ్లు, అదనపు తదగదులు మధ్యాహ్న భోజనాన్ని వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుతెలిపారు. లక్ష్యాలనునిర్ధారించుకొని వాటిని సహకారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, ఒక సమయపాలన పట్టికను ఏర్పాటు చేసుకొని చదవాలని, మీకు ఏమైనా సబ్జెక్టులలో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు ల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

