

ఏ 2టీవీ న్యూస్ ఏప్రిల్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసి, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మండల సమావేశంలో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, లాభదాయక పంటల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపులో ప్రభుత్వ సహకారం కీలకమని మండల సమాఖ్య సభ్యురాలు పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన గృహాలతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా బేగం, సర్పంచ్ డి.శేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

