Thursday, May 7, 2026

ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందించాలి.

–గ్రామస్థాయిలో సమస్యలు గుర్తించాలి

–మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య

ఏ 2టీవీ న్యూస్, ఏప్రిల్ 16, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు.ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం మండల సభల ప్రధాన ఉద్దేశంమన్నారు. చిన్న శంకరంపేట మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ మాలతీ, ఎంపీడీవో దామోదర్, ఎస్సై నారాయణ గౌడ్ హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్ఐ. నారాయణ గౌడ్ మాట్లాడుతూ, అరైవ్- అలైవ్ కార్యక్రమంలో రోడ్డు నియమావళి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ఉప సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular