ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్17, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

టిజిఈజేఏసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంపౌండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాగణంల్లో ఓ పక్క విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల న్యాయ పరమైన డిమాండ్లను కోరుతూ, నల్ల బ్యాడ్జిలను ధరించి శాంతియుతంగా నిరసన చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతే కాకుండా పీఅర్సిలను, డిఎలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి కర్రే పోచయ్య, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్, సత్యనారాయణ, రతన్ తోపాటు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

