ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
వేసవి సెలవులు, పెళ్లి ముహూర్తాలు, టూర్లతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దొంగలు ఉపయోగించుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి.ఇంట్లో బంగారం, నగదు ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలి.బీరువా తాళాలు బయట పెట్టి వెళ్లకూడదు.నాసిరకం తాళాలు వాడకూడదు, తలుపులకు సెంటర్ లాక్ పెట్టాలి.ఇంటి ముందు చెప్పులు ఉంచడం, లైట్లు ఆన్‌లో ఉంచడం మంచిది.బయటకు వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.నమ్మకమైన వ్యక్తులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.ప్రయాణాల్లో అపరిచితుల నుంచి ఆహారం తీసుకోవద్దు.కాలనీలో, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రత పెరుగుతుంది.అనుమానం కలిగితే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

