Thursday, May 7, 2026

మశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి: ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు సమయపాలనను కచ్చితంగా పాటించాలని సూచించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై పూర్తి అవగాహన కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. “చట్టం అందరికీ సమానం” అనే సిద్ధాంతాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.విధుల నిర్వహణలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular