Thursday, May 7, 2026

నర్సాపూర్ సాహితీ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ పట్టణంలోని సాహితీ గ్యాస్ ఏజెన్సీపై రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు సివిల్ సప్లైస్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలు వెలుగులోకి తెచ్చారు. ఈ విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు.తనిఖీల సందర్భంగా గృహ వినియోగానికి సరఫరా చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ గోదాం ద్వారా పంపిణీ చేయకుండా, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అనధికారికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన చర్యగా గుర్తించి సంబంధిత సాహితీ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నిత్యానంద్ మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ నిల్వలు మరియు అనధికారిక విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించినట్లయితే కేసులు నమోదు చేసి, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సాహితీ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణను తాత్కాలికంగా ద్వారకా గ్యాస్ ఏజెన్సీ, నర్సాపూర్‌కు కస్టడీగా అప్పగించినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular