–భావోద్వేగానికి గురైన ఎస్సై సృజన
–హెల్మెట్ లేకుంటే జరిమానా
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19 చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో వల్లభాపూర్ గ్రామాన్ని రోడ్డు భద్రతలో మాడల్ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఎస్సై బీమరి సృజన సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, మాజీ జెడ్పీటిసి బాణాపురం కృష్ణ గౌడ్ హాజరయ్యారు. వాహనదాలకు 80 హెల్మెట్లను అందించారు. ఎస్సై భీమరి సృజన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఎస్సై సృజన భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కట్ట తడిపెట్టారు. ఆరోజు మా తడి హెల్మెట్ ధరించి ఉంటే కనీసం గాయాలతోనైనా బతికి తమ కళ్ళ ముందు ఉండేవారని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. సీఐ వెంకట రాజా గౌడ్, జాతీయ రహదారి సంస్థ పోగ్రామ్ ఎగ్జిక్యూటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లినా తప్పనిసరి హెల్మెట్తో వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని వాహనదాలకు సూచించారు.

