ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన పడాల విట్టల్-లక్ష్మి దంపతుల కుమారుడు వరప్రసాద్ (30). తన వివాహం ఈనెల 23న ఉన్నందున వివాహ పత్రికలు బంధువులకు ఇచ్చేందుకు తన స్కూటీపై చిన్న శంకరంపేట నుండి మెదక్ వెళ్ళుతుండగా, అంబాజీపేట గ్రామ శివాల్లో స్కూటీ కి కుక్క అడ్డం రాగా కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొని తీవ్ర గాయాలు కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడ్డ వరప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

