Thursday, May 7, 2026

బసవేశ్వర జయంతోత్సవం ఘనంగా నిర్వహణ

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర 893వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయడం నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. బసవేశ్వరుడు సాంప్రదాయ సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు అని పేర్కొన్నారు. మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు లింగన్న, మల్లప్ప (గౌరవ అధ్యక్షుడు), పి.డి ఆనందం (జిల్లా జనరల్ సెక్రటరీ), వీరేశం (కోశాధికారి), ప్రభు కుమార్ శెట్టి, శ్రీకాంత్, నత్తటి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular