ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొర్వి సురేష్ తోపాటు మరో 50 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పార్టీలో చేరడం చేరగా వారికి కండువా కప్పి స్వాగతించారు. వారు మాట్లాడుతూ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పరిపాలన తీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు అంజా గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు సానసత్యనారాయణ,శంభుని రాజకుమార్ గౌడ్, పోతరాజు రమణ, బోయిని ప్రభాకర్, గొల్ల నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

