ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
ఆదివారం కురిసిన అకాల వర్షానికి మండలంలోని కామారం గ్రామంలో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ విస్తీర్ణ అధికారులు సోమవారం పంటలను పరిశీలించారు. అలాగే రోడ్డుపై కొనుగోలు కేంద్రాలలో నీ తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించగా 15 మంది రైతుల పది ఎకరాల పంట నష్టమైందని అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను పై అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేటట్లు చూస్తామని రైతులకు తెలిపారు.

