Thursday, May 7, 2026

పేదోని సొంతింటి కళ నెరవేర్చింది.

–ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎంపీడీవో దామోదర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. చిన్నశంకరం పేట మండలంలో 549 ఇండ్లు మంజూరు కాగా 32 ఇండ్లు పూర్తికాగా 439 ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తి కాబడిన 32 ఇండ్లు లో లబ్ధిదారులు సోమవారం గృహప్రవేశాలు పొందగా చిన్నశంకరంపేటలో గేట్ మీది సురేష్-మౌనిక దంపతుల ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం పొందారు. అలాగే రుద్రారం గ్రామాలలో హేమలత ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పొందారు. అనంతరం ఎంపీడీవో దామోదర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలోఈగృహప్రవేశాల ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపివో వినోద్, సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఆకుల సంతోషి నవీన్, ఈవో ప్రదీప్ ,మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, రమేష్ గౌడ్, హాజరుకాగా ఎంపీడీవో దామోదర్ ఇందిరమ్మ ఇండ్ల ను ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular