కొల్చారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.. ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కొల్చారం మండలంలోని వరిగుంతం, రంగంపేట, పైతర తదితర గ్రామాల్లో పిఎసిఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.ప్రభుత్వ కేంద్రాలనే వినియోగించుకోవాలి:ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ:అనంతరం పైతర మరియు కోనాపూర్ గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే సునీతమ్మ భూమిపూజ నిర్వహించారు. పేదల సొంతింటి కల నర్సాపూర్ నియోజకవర్గంలో సాకారం అవుతోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.పాల్గొన్న ముఖ్య నేతలు, అధికారులు:ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీవో ఉన్నిసా బేగం, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, మండల యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి (పైతర), సర్పంచులు అరిగే స్వర్ణలత విజయకుమార్ (రంగంపేట), మోతుకు నిర్మల మల్లేశం (కోనాపూర్), దొడ్లే ఆంజనేయులు (తుక్కాపూర్), కోరబోయిన లక్ష్మీపెంటయ్య (పెనుగండ్ల), యోహాన్ (వరిగుంతం) పాల్గొన్నారు.అలాగే వార్డు మెంబర్ పోలంపల్లి నర్సింహులు, నాయకులు బక్కప్ప, పుష్క మల్లేశం, ఉష్క సుధాకర్, మాజీ సిడిసి చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, ఉపసర్పంచులు చిట్కుల సురేష్, రవీందర్, మాజీ సర్పంచులు భాను ప్రకాష్ రెడ్డి, మురళి గౌడ్, ఎల్లేశం, నాయకులు రామచందర్, రాజా గౌడ్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

