Thursday, May 7, 2026

2027 డిజిటల్ జనగణనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

2027లో పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనగణన విజయవంతం కావాలంటే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు శిక్షణలో సంపూర్ణ అవగాహనతో పాల్గొనాలని సూచించారు.కౌడిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జనగణన–2027 నిర్వహణలో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిజిటల్ జనగణనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని, శిక్షణలో చెప్పే విషయాలను జాగ్రత్తగా గ్రహించాలని సూచించారు. ఈ శిక్షణ మూడు రోజులపాటు కొనసాగుతుందని, ఇందులో ప్రశ్నలు–సమాధానాల రూపంలో జనగణనకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular