

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బదిలీపై ఆదివారం మెదక్ జిల్లాకు వచ్చిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, గారికి జిల్లా పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను ఆయన స్వీకరించారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపారు.తదనంతరం ఆయన జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

