ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరంపేట రా నందు కాంప్లెక్స్ స్థాయి క్విజ్ కార్యక్రమం కాంప్లెక్స్ పరిధిలోని 5వ తరగతి చదువుతున్న 10 పాఠశాలల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం అత్యంత ఆసక్తిగా నిర్వహించడం జరిగింది.ఈ క్విజ్ కార్యక్రమంలో పరిసరాల విజ్ఞానం, గణితం అనే విషయాలపై విద్యార్థులకు ప్రశ్నించి వారి యొక్క స్థాయిని తెలుసుకోవడం జరిగింది.ప్రతి నెల ఇదేవిధంగా విద్యార్థుల్లో పోటీ తత్వం మరియు విషయ అవగాహన పెంచుకోవడం కోసం ఆరోగ్య పూర్వక వాతావరణం లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుటకు నిర్ణయించనైనది.విద్యార్థులు అందరూ క్విజ్ కార్యక్రమంలో పాల్గొని పోటాపోటీగా జవాబులు చెప్పి కార్యక్రమ వాతావరణo ఆసక్తికరం చేయడం జరిగింది. పోటీలో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాల శంకరంపేట రా విద్యార్థులు ప్రథమ స్థానం పొందగా ఎంపీపీ ఎస్ మల్లుపల్లి విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని పొందడంజరిగింది.విద్యార్థులు ఉపాధ్యా యులందరికీ మధ్యాహ్న భోజనాన్నిఅందించడంతోపాటుప్రతిపాఠశాలలోసంగ్రహణాత్మకమూల్యాంకనంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతిని అందజేయడం జరిగింది. మరింత పట్టుదలతో రాబోయే కార్యక్రమాల్లో పాల్గొనాలని మండల విద్యాశాఖ అధికారి దీప్లా రాథోడ్ విద్యార్థులకు సూచన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

