Thursday, May 7, 2026

జనగణనలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర కీలకం: కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.టేక్మల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జనగణన శిక్షణా కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ సిబ్బందికి జనగణన విధానం, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డేటా సేకరణను ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించడం జనగణన విజయానికి ప్రధానమని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.జనగణనలో ఉపయోగించే 34 పాయింట్లను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షణలో పాల్గొన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular