ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఉపాధి హామీ పనులను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించి కూలీ పనులు చేస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు. కూలీ పనులు చేస్తున్న కూలీలను ఉదయం పూటనే పనులు చేయాలని, మళ్లీ సాయంత్రం పనులు చేయాలని సూచించారు. ఉపాధి కూలీలతో పనుల విషయంలో మాట్లాడారు. పనులు చేస్తున్న ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని టిఏలు గోపాల్ సంపత్ కు సూచించారు. పని ప్రదేశంలో త్రాగునీరు తప్పనిసరిని ప్రధమ చికిత్స డబ్బా తప్పనిసరనితెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనురాధ సంపత్ పాల్గొన్నారు.

