ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి లోని కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ మాలతీ మంగళవారం సందర్శించారు. ఆదివారం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ మాలతీ మాట్లాడుతూ, మండలంలో కామారం గ్రామంలో 15 మంది రైతులకు సంబంధించిన వరి పంట నష్టం వాటిల్లిందని తమకు సమాచారం అందిందన్నారు. వ్యవసాయ అధికారి తన సిబ్బందితో క్షేత్రస్థాయిలో వెళ్లి పంటలను పరిశీలించి పై అధికారులకు నివేదిక అందిస్తున్నట్లు తెలిపారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యంపై టార్పిన్ కప్పాలని సూచించారు. వరి ధాన్యం ఆరబోసి తేమశాతం లేకుండా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. కొనుగోలు నిర్వాహకులు పాల్గొన్నారు.

