ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 23,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
రహదారి భద్రత లో భాగంగా చిన్న శంకరంపేట మండలంలోని ప్రతి గ్రామంలోని రోడ్లపై వరి ధాన్యం మక్కలు ఆరబెట్టిన రైతులకు ధాన్యాన్ని తొలగించాలని పోలీసులు నోటీసులు గురువారం అందించారు. ప్రతి గ్రామంలో అవగాహన కోసం చాటింపు వేయాలని సర్పంచ్లకు కార్యదర్శులకు పోలీసులు సమాచారం అందించారు. రోడ్లపై వాహనదారులు ఆరబెట్టిన ధాన్యం కుప్పలను ఢీకొని మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, భద్రతలో భాగంగా రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు బాటసారులకు ఇబ్బందులు కలగవద్దని సాఫీగా ప్రయాణం చేయుటకు ఈ ముఖ్య ఉద్దేశం అన్నారు.

