
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై గ్రామ ప్రజలతో కలిసి విస్తృతంగా చర్చలు జరిపారు.ఈ కార్యక్రమం సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ సబితా సమన్వయంతో జరిగింది. సభలో గ్రామానికి సంబంధించిన ముఖ్య సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజల నుంచి సూచనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముద్దురి రాజు, వార్డు సభ్యులు మంగళి లక్ష్మణ్, అబ్రమైన యశోద, గొర్రె శ్రీహరి, గొర్రె ఎల్లవ్వ, బండ్ల వేణు, తొయేటి రాధకృష్ణ, కొమ్ము కవిత తదితరులు పాల్గొన్నారు.

