

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవి మాతకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పల్లెర్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి బుక్క అశోక్, కోషాధికారి మరుమల్ల అశోక్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాయకంటి నాగరాజు, పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్, ఉప్పల శ్రీకాంత్, కోవురి శ్రీనివాస్, షిర్నా రాజేశ్వర్, చంద్రపాల్, మేడం బాలకృష్ణ, రాగి అశోక్, వుట్కురి వీరేశం, కౌన్సిలర్ శివరామకృష్ణ, కొండా శ్రీనివాస్, పురం వెంకట నారాయణ, కొమ్మ వెంకటేష్, బజ్జూరి బిక్షపతి, మురళి, పొగాకు రామకృష్ణ, వనజ, సుష్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

