Thursday, May 7, 2026

సూపర్ పోలీస్ పనితీరు… చోరీ ఫోన్ పది రోజుల్లో రికవరీ

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 26 నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం, కొల్చారం మండలంలో పోలీసులు మరోసారి తమ చురుకైన పనితీరును చాటుకున్నారు. చోరీకి గురైన ఒక సెల్‌ఫోన్‌ను కేవలం పది రోజుల్లోనే రికవరీ చేసి యజమానికి అప్పగించారు.అప్పాజిపల్లి గ్రామానికి చెందిన తిమ్మకపల్లి గోపాల్ ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాల సహాయంతో వేగంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఫోన్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.తరువాత ఆ మొబైల్ ఫోన్‌ను ఏఎస్‌ఐ సుధాకర్ చేతుల మీదుగా యజమానికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, “మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే రికవరీ త్వరగా సాధ్యమవుతుంది” అని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular