Thursday, May 7, 2026

ఏడుపాయల జాతరలో చిన్నారి వెండి కడియాలు అపహరించేందుకు యత్నం –

అప్రమత్తమైన పోలీసులతో నిందితుడి పట్టివేత

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఆదివారం జరిగిన ఏడుపాయల వనదుర్గామాత జాతరలో అపహరణ యత్నం చోటుచేసుకుంది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం మాదిరిగానే క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో, ఒక తల్లి షాపులో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో ఆమెతో ఉన్న చిన్నారిని ఓ దుండగుడు ప్రక్కకు తీసుకెళ్లాడు. చిన్నారి కాళ్లలో ఉన్న వెండి కడియాలను అపహరించి, వాటిని తన లోదుస్తుల్లో దాచుకున్నాడు.విధుల్లో ఉన్న QRT సిబ్బంది ఈ అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే స్పందించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొదట అతను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా చిన్నారి వద్ద నుంచి అపహరించిన రెండు వెండి కడియాలు అతని వద్ద లభించాయి.పోలీసులు వెంటనే ఆ వెండి కడియాలను చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనను చూసిన భక్తులు పోలీస్ సిబ్బంది అప్రమత్తతను, సమయస్ఫూర్తిని ప్రశంసించారు.అనంతరం నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం పాపన్నపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతర సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular