ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, మనోహరబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మండలవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి, మండల కేంద్రం మనోహరాబాద్ సహా పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ సాధించి, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరిగి పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

