Thursday, May 7, 2026

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, శివంపేట ప్రతినిధి (రామకృష్ణ)

శివంపేట మండలంలో సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొత్తపేట్‌తో పాటు మండల కేంద్రం శివంపేట మరియు ఇతర గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా శివంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తిరిగి కే. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular