ఏ2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
భారత రాష్ట్ర సమితి పార్టీ దినోత్సవాన్ని సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ అధ్యక్షుడు పట్లో రాజు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు హేమచంద్రo పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ కేసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళమా దేశంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనకంటే ముందు దశాబ్దాలను నెమరు వేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చాటి చెప్పుకున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా ఏదింటి ఆడపిల్లల పెళ్ళికొరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాష్ట్రంలో నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ పథకాలతో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టాలని గుర్తించారు ఆయన చేసిన సేవలను కొనీయాదారు. గ్రామాలలో జై కేసీఆర్ అంటూ నినాదాలు మార్మోగాయి.

