ఏ2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట (కమ్మరి దేవరాజ్)
స్పోర్ట్స్ సర్వీస్ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో దళిత నాయకుడు ముత్తిగళ్ళ రామచంద్రo కు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం శాలువాతో సన్మానించారు. ఈ అవార్డు వచ్చే నెల 14న అందించడంతో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మెదక్ వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రామచంద్ర ఈ అవార్డు అందుకోవడం సంతోషకరమని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి సంగాయపల్లి ఉప సర్పంచ్ కే. సాయిలు పాల్గొన్నారు.

