ఏ 2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట ప్రతినిధి ( కమ్మరి దేవరాజు)
ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సర్పంచ్ నాయిని ప్రవీణ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు తమ పంటను కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

