ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27,నర్సాపూర్ సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

తునికి లో బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చడం పిరికి పంద చర్య అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అపారమైన మద్దతును తట్టుకోలేక, ప్రతిపక్షాలకు చెందిన కొందరు దురుద్దేశపూర్వకగ కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన ఖండనీయమైన చర్య.ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా అవమానపరిచే ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.దిమ్మెను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, వారి వెనుక ఉన్న ప్రేరేపకులను కూడా బయటపెట్టి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు, ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను .ఇలాంటి పిరికిపంద చర్యలతో బీఆర్‌ఎస్ పార్టీని మా కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరు. ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే,బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ.

