–సాంస్కృతిక కళ రాష్ట్ర శాఖ చైర్మన్ గుమ్మడి వెన్నెల కు సన్మానం
ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
సాంస్కృతిక కళ రాష్ట్ర శాఖ చైర్మన్ గుమ్మడి వెన్నెలకు సోమవారం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రం నుంచి మెదక్ వెళుతూ మండల కేంద్రంలో ఆగారు. కాంగ్రెస్ నాయకులు తదితర నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సముస్కృతిక కళలపై యువకులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతి కార్యక్రమాలపై పెద్ద పీటా వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంభుని రాజ్ కుమార్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు హలావత్ మోహన్ నాయక్, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ముత్తిగల రామచంద్రం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

