ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27 చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు ఒకేసారి వాతావరణం చల్లబడింది. చిన్న శంకరంపేట మండలం మల్లు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొట్టుకపోకుండా రైతులు తట్టలతో నీళ్లు తీసేస్తున్నారు. తరిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులు కోరారు.

