Wednesday, May 6, 2026

రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలురంగంపేటలో అన్నదాతలకు అవగాహన

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది డి ఆర్ లక్ష్మణ్ రావు , డి ఆర్. నీమ కూల్చారం మండలంలోని రంగంపేట్ గ్రామంలో అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి ఆర్ .లక్ష్మణరావు మాట్లాడుతు, పంటలలో యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులు వాడడం మరియు సేంద్రియ పద్ధత్తులపై వివరించడం జరిగింది. డి ఆర్ నీమా మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి పంటలపై చర్చించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగం పై కెవికె తునికి సైంటిస్ట్ డి ఆర్ ఎం రవికుమార్ క్లుప్తంగా వివరించారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత , ఉప సర్పంచ్, వార్డు మెంబెర్స్, రైతులు, మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కీర్తన హెచ్ ఈ ఓ, వెటర్నరీ డాక్టర్ పి. ప్రియాంక , పామాయిల్ తోట ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ , మండల వ్యవసాయ అధికారి ఎం శ్వేత కుమారి, ఎక్స్టెన్షన్ అధికారి రాజశేఖర్ గౌడ్, మరియు వ్యవసాయ ఇంజినరింగ్ కళాశాల విద్యార్థులు సుల్తాన్, వరప్రసాద్ రైతులుపాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular