ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ (గజిని) ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..దళారులను నమ్మి రైతులు మోసపోరాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతులు వారి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వం రైతుకు సరైనగిట్టుబాటు ధర చెల్లిస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వం రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్చలం నర్సింలు వార్డు సభ్యులు సదాల నర్సింహులు, మానేపల్లి సావిత్రి ,కదూరి సుశీల, రామానుజం, పంచాయతీ కార్యదర్శి ఫణింద్ర, సీఈఓ కృష్ణ, పార్టీ గారి కృష్ణ ,కదూరి కుమార్ తిమ్మక్క పల్లి ప్రభాకర్, తిమ్మక్కపల్లి సుధాకర్ శంకర్ గౌడ్ ,శ్రీకాంత్ గౌడ్, సురేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

