Wednesday, May 6, 2026

రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలి–టి పి టి ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ స్వామి రమేష్ చారి పిలుపు.

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ఈ నెల 30న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే టి పి టి ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని టిపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటస్వామి, రమేష్ చారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విద్య సదస్సులో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశ- రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు వంటి అంశములపై చర్చలు జరుగుతాయని తెలిపారు . ఈ రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రముఖ వక్తులుగా ప్రొ. హరి గోపాల్ గారు, ప్రొ. కోదండరాం గారు, చింతకింది కాసిం గారు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు తదితర వక్తలు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తూప్రాన్ మండల రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టి పి టి ఎఫ్ ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘమని కొనియాడారు. మరియు ఇలాంటి విద్యా సదస్సులు ఉపాధ్యాయులకు నేటి పరిస్థితులపై అవగాహన పెంచడంతోపాటుగా సమాజంపై పూర్తి చైతన్యం కలిగిస్తాయని తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ టి పి టి ఎఫ్ అధ్యక్షులు ముత్యాలు గౌడ్, మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ వి పద్మ, జిల్లా కౌన్సిలర్లు పరమేశ్వర చారి, కిష్టయ్య, మండల కార్యదర్శి శ్రీనివాస్, ప్రవీణ్, రవీందర్ ,వసుధ, ఉమాదేవి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular