Wednesday, May 6, 2026

జిల్లాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు: ఆర్డీవో రమాదేవి

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి స్పష్టం చేశారు. ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసిల్దార్ లక్ష్మణ్ బాబుతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 12,000 లీటర్ల ఆయిల్ ట్యాంకర్ (8,000 లీటర్లు పెట్రోల్, 4,000 లీటర్లు డీజిల్) పంపుకు చేరింది.ప్రస్తుతం పెట్రోల్ నిల్వలు 29,232 లీటర్లు, డీజిల్ నిల్వలు 26,667 లీటర్లు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లాలో ఇంధన లభ్యత సమృద్ధిగా ఉన్నందున వినియోగదారులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.అనంతరం మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. గన్ని సంచుల లభ్యత, తాగునీటి సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 1,200 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సిబ్బంది వివరించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular