ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని హంసాన్పల్లి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ చైర్మన్ మన్నెరాములు,మాజీ సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి లతో కలిసి సహకార సంఘం సీఈవో ఆంజనేయులు లాంచనంగా ధాన్యం తూకం వేసే కాంటాకు కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ..ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి శ్రీలత, నర్సా గౌడ్ ,వెంకట్ గౌడ్, రమేష్ ,రాములు రైతులు పాల్గొన్నారు.

