ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ గ్రామ సర్పంచ్ స్వప్న ఊశయ్య
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ. రైతులు ఈ ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సకాలంలో సద్విని చేసుకొని వరి ధాన్యాన్ని విక్రయించవలసిందిగా కోరుతూ. దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వమేదైతే చిత్తశుద్ధితో ఉంది రైతుల పట్ల వరి ధాన్యం చివరి గింజ వరకు కొనే ఏర్పాట్లు మన రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందస్తు వర్షాల కారణంగా రైతులు మీ కల్లాల వద్ద అప్రమత్తంగా ఉండి టార్పణెండ్లు అందుబాటులో ఉంచుకొని వర్షాల నుండి వరి ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉన్నది రైతులు క్యూ పద్ధతిలో కొనుగోలు కేంద్ర సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఈఓ నవీన్ గ్రామ సర్పంచ్ సప్న ఉషయ్య కిష్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం వార్డు సభ్యులు వెంబడి మల్లేశం మల్కా ప్రవీణ్ శేఖర్ రైతులు శేఖర్ గావ్కాని పోచయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ భాస్కర్ నవీన్ సిబ్బంది యాదగిరి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

