ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ను పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధరను పెంచుతూ వస్తుందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లోనే రైతు తన ధాన్యాన్ని అమ్మాలనితెలుపడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు నాని, పి ఎ సి ఎస్ సీఈవో కృష్ణ, ఏ ఈ ఓ నిరోషా, వార్డు మెంబర్లు నాయికోటి మహిపాల్, గొల్ల ఏగొండ, బుట్ట శ్రీనివాస్, చిట్యాలయాదయ్య, గడ్డమీదినర్సింలు,సాయిని సిద్దిరములు, కొమ్ముల చిన్న గౌడ్,పాతూరి రామకృష్ణ గౌడ్,చాకలి నాగరాజు,నర్సింలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

