Wednesday, May 6, 2026

పక్కాగా జనగణన – సజావుగా ధాన్యం కొనుగోలు

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతో పాటు ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందికి సూచించారు.బుధవారం నిజాంపేట మండల కేంద్రంలో ఆయన జనగణన తీరును డోర్ టు డోర్ తిరిగి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి పూర్తి సమాచారం సేకరించడంతో పాటు ప్రజలందరినీ జనగణనలో భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నగేష్, తూకం ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ధాన్యం తూకంలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వం పాటించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular