ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది నూతన కళాకారులకు అవకాశాలు ఇస్తున్న సినీ శ్రామికుడు, దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. మన దేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్ తో కలిసి పర్యావరణ పరిరక్షణ కు కృషి చేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్ జి ఐ పి ఫౌండేషన్ పీసీ ఆదిత్య సేవల్ని గుర్తించి ఇండోనేషియా ఎక్సలెన్సీ అవార్డు2026ను బహుకరించినట్లు ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్త తెలిపారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రూపోందిస్తున్న పీసీ ఆదిత్య కు ఈ అవార్డు అందజేయడం గర్వం గా ఉందన్నారు… అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ మన దేశానికి మిత్ర దేశమైన ఇండోనేషియా నుండి ఈ అంతర్జాతీయ అవార్డు అందుకోవడం భారతీయుడిగా గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను సినీ రంగానికి చెందిన పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

