Wednesday, May 6, 2026

దివ్యభారత్ పుస్తకంలో కొండగట్టు అంజన్న స్వామికి చోటు

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తెలంగాణలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా పేరున్న కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. నీతి అయోగ్ రూపొందించిన దివ్యభారత్ పుస్తకంలో ఈ ఆలయానికి చోటు దక్కడం తెలంగాణ రాష్ట్రానికి, ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్లయింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మన దేశంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, దర్శనీయ స్థలాలను పరిచయం చేస్తూ నీతి అయోగ్ సంస్థ దివ్యభారత్ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం లో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నకు స్థానం దక్కడంతో ఈ ఆలయ చరిత్ర, విశిష్టత దేశవ్యాప్తంగా నే కాకుండా దేశ విదేశాలకు సైతం పాకినట్లు అవుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, భక్తులు ఈ గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవంతో కొండగట్టు అంజన్న క్షేత్రం దేశ పర్యాటక పటంలో ప్రాముఖ్యతను సంతరించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular