ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి లో శ్రీకరి జువెలర్స్ & పాన్ బ్రోకర్స్ ఆధ్వర్యంలో కౌడిపల్లి స్థానిక ఏఎస్ఐ ఆండాలు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గురువారం సంత కావడంతో సంతకు వచ్చిన ప్రజలకు చల్లని నీరు మజ్జిగ అందించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ… రోజురోజుకు ఎండల ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకరి జ్యువెలర్స్ యజమాని నాగరాజు చారి, ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం గర్వించదగ్గ విషయం అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం వేసవికాలం వచ్చిందంటే చాలు ఎందరెందరో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడానికి ముందుకొచ్చే వారన్నారు. ప్రస్తుతం హోటల్ కి వెళ్లి గ్లాసేడు నీళ్లు తాగాలన్న 20 రూపాయలు బాటిల్ కొని తాగాలంటున్న యజమానులు ఉన్నారు. త్రాగే నీటితో కూడా వ్యాపారం చేస్తూన్నారు అన్నారు. ఇలాంటి సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నందుకు నాగరాజు చారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చి నిర్వహించడం ద్వారా ప్రజలకు మంచి చేసినవారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో జహీర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజీవ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పోల నవీన్, చంద్రం వెంకట్ గౌడ్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహ చారి, గ్రామ పెద్దలు పునరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, జగన్,మాసన్న గారి హరీష్, గుడ్డంల రాజశేఖర్, శ్రీకాంత్ గౌడ్, తోపాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

