Wednesday, May 6, 2026

బాలల సంరక్షణపై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా అమలు

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బాలల సంరక్షణపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ఈ సందర్భంగా మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ ఎగ్జిబిషన్‌ను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా వీక్షించారు.ఈ సందర్భంగా వల్లేటి ప్రేమ్ చంద్ మాట్లాడుతూ, జిల్లాలో బాలల సంరక్షణపై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. పిల్లలకు ఎగ్జిబిషన్‌ను ప్రతిరోజు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని, బాలల న్యాయపరమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular