ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 30,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
ఎస్సీ ఎస్టీ మహిళలపై దురుసుగా ప్రవర్తిస్త కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ మాలతీ అన్నారు. గురువారం మండల పరిధి రుద్రారం గ్రామంలో ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినాన్ని అవగాహన సదస్సులో ఆమెమాట్లాడుతూ,బాల్య వివాహాలను అరికట్టాలని మద్యానికి దూరంగా ఉండాలని, సైబర్ నెల పట్ల యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సంతోష నవీన్, కుమార్ ఉప సర్పంచ్, పుల్లగళ్ల నరసింహులు, కొంగర సత్తయ్య, క్యసారం బాలు, శవాల దుర్గ పతి, మహిళా సంఘాల నాయకులు అంగన్వాడి టీచర్ సలీమా, రూపా, రాణి ఆశ వర్కర్ కవిత, పాల్గొన్నారు.

