Wednesday, May 6, 2026

ఈవ్‌టీజింగ్‌పై షీ–టీమ్స్ ఉక్కుపాదం

ఏప్రిల్‌లో 8 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ–పెట్టి కేసులు56 మందికి కౌన్సెలింగ్ – 40 అవగాహన కార్యక్రమాలుజిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ–టీమ్స్ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిపై ఏప్రిల్ నెలలో 8 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ–పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తూప్రాన్ సబ్‌డివిజన్‌లో 16 మంది, మెదక్ సబ్‌డివిజన్‌లో 40 మంది కలిపి మొత్తం 56 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళలను గౌరవించాలని, చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో షీ–టీమ్స్ ఆధ్వర్యంలో 40 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఎవరైనా మహిళలను వేధించినా, అవహేళనగా మాట్లాడినా లేదా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100 లేదా షీ–టీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.అలాగే, 18 ఏళ్లు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కూడా పనిచేస్తోందని, మానవ అక్రమ రవాణా మరియు ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular