ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి సాదరంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందించిన సేవలను కొనియాడారు.శివధర్ రెడ్డి నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

