Wednesday, May 6, 2026

మెదక్ జిల్లాలో మే నెల పొడవున 30 పోలీసు యాక్ట్ అమలు

ఏ2డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మే 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.ఈ కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఆయన స్పష్టం చేశారు.అలాగే ప్రజల లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular